English | Telugu

2014 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాలకు గద్దర్‌ అవార్డులు.. స్పెషల్‌ జ్యూరీ అవార్డులు!

తెలుగు సినిమాకి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ప్రతిభ కనబరిచిన కళాకారులకు పురస్కారాలు అందించే కార్యక్రమం 1964లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి ఏడాది నంది అవార్డు పేరుతో ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ కళాకారులకు పురస్కారాలు అందిస్తూ వస్తోంది. అయితే దీన్ని 2013 తర్వాత కొనసాగించలేకపోయారు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరగడంతో అవార్డుల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు గద్దర్‌ అవార్డులుగా నామకరణం చేశారు. అందులో భాగంగానే 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు ఇటీవల అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ వ్యవహరించారు. అలాగే 2014 నుంచి 2023 సంవత్సరం వరకు విడుదలైన సినిమాలకు సంబంధించి ఉత్తమ చిత్రాల అవార్డులను ప్రకటించారు. ఈ పది సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల కమిటీకి ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. పది సంవత్సరాల కాలంలో విడుదలైన సినిమాల్లో గద్దర్‌ అవార్డులు గెలుచుకున్న ఉత్తమ చిత్రాల వివరాలను ప్రకటించారు.

2014
ఉత్తమ చిత్రం : రన్‌ రాజా రన్‌
ఉత్తమ ద్వితీయ చిత్రం : పాఠశాల
ఉత్తమ తృతీయ చిత్రం : అల్లుడు శ్రీను

2015
ఉత్తమ చిత్రం : రుద్రమ దేవి
ఉత్తమ ద్వితీయ చిత్రం : కంచె
ఉత్తమ తృతీయ చిత్రం : శ్రీమంతుడు

2016
ఉత్తమ చిత్రం : శతమానం భవతి
ఉత్తమ ద్వితీయ చిత్రం : పెళ్లిచూపులు
ఉత్తమ తృతీయ చిత్రం : జనతా గ్యారేజ్‌

2017
ఉత్తమ చిత్రం : బాహుబలి ది కంక్లుజన్‌
ఉత్తమ ద్వితీయ చిత్రం : ఫిదా
ఉత్తమ తృతీయ చిత్రం : ఘాజీ

2018
ఉత్తమ చిత్రం : మహానటి
ఉత్తమ ద్వితీయ చిత్రం : రంగస్థలం
ఉత్తమ తృతీయ చిత్రం : కేరాఫ్‌ కంచరపాలెం

2019
ఉత్తమ చిత్రం : మహర్షి
ఉత్తమ ద్వితీయ చిత్రం : జెర్సీ
ఉత్తమ తృతీయ చిత్రం : మల్లేశం

2020
ఉత్తమ చిత్రం : అల వైకుంఠపురములో
ఉత్తమ ద్వితీయ చిత్రం : కలర్‌ ఫోటో
ఉత్తమ తృతీయ చిత్రం : మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌

2021
ఉత్తమ చిత్రం : ఆర్‌ఆర్‌ఆర్‌
ఉత్తమ ద్వితీయ చిత్రం : అఖండ
ఉత్తమ తృతీయ చిత్రం : ఉప్పెన

2022
ఉత్తమ చిత్రం : సీతారామం
ఉత్తమ ద్వితీయ చిత్రం : కార్తికేయ2
ఉత్తమ తృతీయ చిత్రం : మేజర్‌

2023
ఉత్తమ చిత్రం : బలగం
ఉత్తమ ద్వితీయ చిత్రం : హనుమాన్‌
ఉత్తమ తృతీయ చిత్రం : భగవంత్‌ కేసరి

స్పెషల్‌ జ్యూరీ అవార్డు : ప్రజాకవి కాళోజీ నారాయణరావు బయోపిక్ ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రానికి స్పెషల్‌ జూరీ అవార్డు

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు

ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిలిం అవార్డ్‌ : నందమూరి బాలకృష్ణ
పైడి జైరాజ్‌ ఫిలిం అవార్డ్‌ : మణిరత్నం
బి.ఎన్‌.రెడ్డి ఫిలిం అవార్డ్‌ : సుకుమార్‌
నాగిరెడ్డి చక్రపాణి ఫిలిం అవార్డ్‌: అట్లూరి పూర్ణచంద్రరావు
కాంతారావు ఫిలి అవార్డ్‌ : విజయ్‌ దేవరకొండ
రఘుపతి వెంకయ్య ఫిలిం అవార్డ్‌ : యండమూరి వీరేంద్రనాథ్‌

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.