English | Telugu

స్టార్ హీరో మూవీ సెట్లో భారీ అగ్ని ప్రమాదం!

కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇడ్లీ కడై' (Idly Kadai). తమిళనాడులోని తేని జిల్లా అనుప్పపట్టి గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షూట్ కోసం వేసిన సెట్ లు దగ్దమయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ధనుష్ హీరోగా, దర్శకుడిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా(నిలవుక్కు ఎన్‌ మేల్‌ ఎన్నడి కోబం) తర్వాత ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'ఇడ్లీ కడై'. వుండర్‌బార్ ఫిల్మ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్ లో రూపొందుతుండగా ధనుష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ధనుష్, నిత్య మీనన్ జంటగా నటిసున్న ఈ చిత్రం, అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.