English | Telugu

షూటింగ్ లో కారు పల్టీ కొట్టడంతో ఫైట్ మాస్టర్ మృతి    



కబాలి, సార్పట్ట, తంగలాన్ వంటి పలు విభిన్న చిత్రాలని ప్రేక్షకులకి అందించిన దర్శకుడు పా రంజిత్. ప్రస్తుతం మరో విభిన్న తరహా కథతో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని స్టంట్ మాస్టర్ ఎస్ ఏం రాజు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు కొన్ని కార్లతో రిస్క్ తో కూడిన యాక్షన్ సీన్స్ నీ చిత్రీకరించారు. కారు పల్టీలు కొట్టడంతో రాజు చనిపోవడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.