English | Telugu

త్వరలోనే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్..!

విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. 2018లో విడుదలైన ఈ కామెడీ ఫిల్మ్ యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇప్పటికీ ఎందరో రిపీటెడ్ గా చూస్తుంటారు. ఇటీవల రీ రిలీజ్ లోనూ మంచి వసూళ్లు రాబట్టిందంటే.. 'ఈ నగరానికి ఏమైంది'కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీకి త్వరలో సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. (Ee Nagaraniki Emaindi Sequel)

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆరేళ్ళ తర్వాత విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ చేతులు కలపబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. ఈ ఇక ఈ క్రేజీ సీక్వెల్ ను '35 చిన్న కథ కాదు' చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్ నిర్మించనుందట.

'ఈ నగరానికి ఏమైంది' నలుగురు స్నేహితుల కథగా ప్రేక్షకులను అలరించింది. ఇందులో విశ్వక్ సేన్​ తో పాటు అభినవ్ గోమఠం, సాయి సుశాంత్, వెంకటేష్‌ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. మరి సీక్వెల్ కోసం అదే గ్యాంగ్ రంగంలోకి దిగుతుందేమో చూడాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.