English | Telugu

మంచు విష్ణువర్థన్ "దొరకడు" జనవరి 5 నుండి

విష్ణు వర్థన్ "దొరకడు" జనవరి 5 నుండి ప్రారంభమవుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీప్రసన్నపిక్చర్స్ పతాకంపై, మంచు విష్ణువర్థన్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా, జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో, మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మిస్తున్న విభిన్నకథా వినోదాత్మక చిత్రం" దొరకడు". ఈ చిత్రం యాక్షన్ తో పాటు పూర్తి ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందని సమాచారం. ఈ "దొరకడు" చిత్రానికి చక్రి సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. ఈ "దొరకడు" చిత్రానికి ప్రముఖ సినీ కథా రచయిత కోన వెంకట్ కథనందిస్తున్నారు.

హీరో విష్ణువర్థన్ ఇటీవలే ఇద్దరు ఆడపిల్లల (కవలలు)కు తండ్రి అయ్యాడు. బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ అని పెద్దలంటూంటారు. మరి తనకు కూతుర్లు పుట్టిన టైం బాగుండి ఈ "దొరకడు" కచ్చితంగా సూపర్ హిట్టవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఒక విధంగా విష్ణు కంటే అతని తమ్ముడు మనోజ్ ఈ సంవత్సరం "మిస్టర్ నోకియా", "ఊకొడతారా ఉలిక్కి పడతారా" అంటూ రెండు సినిమాలతో వస్తున్నాడు. జనవరి 5 వ తేదీన ప్రారంభించబోయే ఈ "దొరకడు"రానున్న వేసవి శలవులకు విడుదలవుతుందని తెలిసింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.