English | Telugu

హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ తేజ కుమారుడు!

సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన తేజ.. 'చిత్రం', 'నువ్వు నేను', 'జయం', 'నేనే రాజు నేనే మంత్రి' వంటి పలు విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'అహింస' మూవీ జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. త్వరలో తన కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడని రివీల్ చేశాడు.

తన కుమారుడిని సినిమాలపై ఆసక్తి ఉందని, త్వరలోనే హీరోగా పరిచయం చేయబోతున్నట్లు తేజ తెలిపాడు. ప్రస్తుతం విదేశాల్లో అందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడని చెప్పాడు. తన కుమారుడు చూడటానికి అందంగా ఉంటాడని, అయితే హీరో అవ్వడానికి కేవలం అందం మాత్రమే సరిపోదని అన్నాడు. అలాగే కుమారుడి మొదటి సినిమాని తాను డైరెక్ట్ చేయాలా? లేక ఇంకెవరికైనా అప్పగించాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పుకొచ్చాడు.

కాగా దర్శకుడిగా తేజ పలువురు హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశాడు. అందులో ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, ఆది పినిశెట్టి వంటి వారున్నారు. మరి అదే బాటలో తన కుమారుడిని కూడా తేజనే పరిచయం చేస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.