English | Telugu

ప్రభాస్ హీరోగా శంకర్ చిత్రం

ప్రభాస్ హీరోగా శంకర్ చిత్రం ప్రారంభించనున్నారు. వివరాల్లోకి వెళితే "అపరిచితుడు" ఫేం శంకర్ తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో త్రిభాషా చిత్రాన్ని తీస్తున్నారట. ఈ చిత్రం తెలుగు వెర్షన్‍ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నారట. హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్తిలాంటి కత్రినా కైఫ్ నటించనుందట.

ఈ చిత్రం తమిళ వెర్షన్ లో హీరోగా కమల్ హాసన్, మళయాళ వెర్షన్ లో మోహన్ లాల్ హీరోలుగా నటిస్తారట. ఈ చిత్రాన్ని ఆస్కార్ రామచంద్రన్ నిర్మిస్తారట. ఈ త్రిభాషా చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తారట. శంకర్ సినిమాలో నటించటం ఒక విధంగా ప్రభాస్ అదృష్టమనే చెప్పాలి. ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని చెప్పవచ్చు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.