English | Telugu

పాన్ ఇండియా లెవెల్లో రికార్డు సృష్టించిన  స్కంద 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌లుగా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సెప్టెంబర్‌లోవిడుదలయిన సినిమా స్కంద. రామ్ సినీ కెరీర్‌లోనే భారీ స్థాయి ఓపెనింగ్స్ ని సాధించిన ఈ పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ స్కంద ఇప్పుడు సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.


స్కంద మూవీ రీసెంట్ గా ఓటిటి లోకి ఆడుగు పెట్టింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోను డిస్నీ హాట్ స్టార్ ద్వారా విడుదల అయిన స్కంద సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్కంద చిత్రం స్ట్రీమింగ్ అయిన మొదటి నలభై ఎనిమిది గంటలు పాటు క్లాక్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోని ప్రేక్షకులు మొదటి రెండు రోజులలోనే విపరీతంగా స్కంద సినిమాని చూసారు. ఇంతవరకు హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమా కి కూడా పాన్ ఇండియా లెవెల్లో ఇంత బజ్ దక్కలేదు. మొట్ట మొదటి సరిగా స్కంద మూవీ ఆ రికార్డు ని సాధించింది.

రామ్ పోతి నేని, బోయపాటి ల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన స్కంద మూవీ థియేటర్లలోనూ విజృంభించడంతో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓటిటి లో కూడా విజృంభించడంతో రామ్ అభిమానులు, బోయపాటి అభిమానులు ఎంతో ఆనందంతో ఉన్నారు.చిత్ర యూనిట్ కూడా సంబరాలు చేసుకుంటుంది. అయితే కొంత మంది సోషల్ మీడియాలో బోయపాటి గత చిత్రాలకి సంబంధించిన సీన్స్ ని తీసుకొని స్కంద మూవీ సాధించిన పాన్ ఇండియా రికార్డు మీద ట్రోల్స్ చేస్తున్నారు


బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం