English | Telugu
అట్లీ నెక్స్‌ట్ చేయబోయేది మల్టీస్టారరే.. ఇంతకీ ఎవరా స్టార్ హీరోలు?
Updated : Nov 14, 2023
'‘రాజా రాణి’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన అట్లీ ఇప్పటివరకు 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఏడు సినిమాల్లో మూడు సినిమాలు విజయ్‌తోనే చేయడం విశేషం. అతని డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలన్నీ తమిళ్‌లోనే రూపొందాయి. తాజాగా షారూక్ ఖాన్ హీరోగా రూపొందించిన ‘జవాన్’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ‘జవాన్’ తర్వాత అట్లీ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో చేస్తాడు? అనే చర్చ సోషల్ మీడియాలో బాగా నడుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అట్లీ ఓ ఇంటర్వ్యూలో తను నెక్స్‌ట్ చేయబోయే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడిరచాడు. విజయ్, షారూక్ ఖాన్‌లతో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు అట్లీ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో బాగా బిజీగా ఉన్నానని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పాడు. ఇటీవల ఓ పార్టీలో విజయ్, షారూక్ కలుసుకున్నారని, వారిద్దరూ ఈ మల్టీస్టారర్ గురించి మాట్లాడుకొని తనకు ఫోన్ చేశారని చెప్పాడు. మల్టీస్టారర్ చేసే ఆలోచన ఉంటే అందులో తాను నటిస్తానని షారూక్ చెప్పాడట. అలాగే విజయ్ కూడా ఫోన్ చేసి ఇదే విషయం గురించి మాట్లాడారని తెలిపాడు. అందుకే వాళ్ళిద్దరితో మల్టీస్టారర్ చెయ్యాలని డిసైడ్ అయినట్టు తెలియజేశాడు. ఇదే తన నెక్స్‌ట్ మూవీ అని, ఈ సినిమా రూ.3,000 కోట్లు వసూలు చేసే సినిమా అవుతుందని చెబుతున్నాడు అట్లీ. విజయ్, షారూక్‌లలో తనకు ఎవరు ముఖ్యం అంటే తాను చెప్పలేనని, తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం విజయ్. తనపై నమ్మకంతోనే వరసగా సినిమాలు ఇచ్చారని చెప్పాడు. అంతేకాదు, హాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ స్టూడియో తనను సంప్రదించిందని, ఆ పనులు కూడా జరుగుతున్నాయని వివరించాడు అట్లీ.