English | Telugu

కల్కి పార్ట్ 2 నుంచి తొలగించడంపై దీపికా రియాక్షన్ ఇదే

ఎన్నో విభిన్నమైన క్యారెక్టర్స్ ని పోషించిన నటిగా, భారతీయ సినీ రంగంలో 'దీపికా పదుకునే'(Deepika Padukune)కి సుదీర్ఘమైన అనుభవం ఉంది. 2006 లో కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో తన సినీ జర్నీని ప్రారంభించి, ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో 'నెంబర్ వన్ హీరోయిన్' టాగ్ లైన్ ని సైతం పొందింది. సినిమా విజయం తాలూకు రేంజ్ ని పెంచగల సమర్థురాలు కూడా. కారణాలు తెలియదు కానీ, కల్కి 2898 ad పార్ట్ 2 నుంచి దీపికాని తొలగిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్నీ అధికారకంగా ధ్రువీకరిస్తూ 'జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాక మేం ఎవ‌రి దారిన వారు వెళ్లాల‌నుకున్నాం. మొద‌టి సినిమా కోసం చాలా దూరం క‌లిసి ప్ర‌యాణించినా, మేం స‌రైన భాగ‌స్వామ్యాన్ని క‌నుక్కోలేక‌పోయాం. దీపిక‌ భవిష్యత్ విష‌యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం' అని వైజ‌యంతి సంస్థ ప్ర‌క‌టించింది.. కల్కి మొదటి భాగం క్లైమాక్స్ చూసిన తర్వాత, సెకండ్ పార్ట్ లో దీపికా రోల్ కి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక రకంగా పార్ట్ 2 లాంటి ప్రెస్టేజియస్ట్ మూవీ,ఆమె కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది. కానీ ఆమెని తొలగించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది

దీపికా ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో అని అందరు ఎదురు చూస్తు వస్తున్నారు. గతంలో ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి(Sundeep Reddy)ల 'స్పిరిట్'(Spirit)మూవీ నుంచి తప్పించినపుడు, వ్యక్తుల గురించి ప్రస్తావించకుండా, సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో దీపికా ఎలా స్పందిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. రీసెంట్ గా దీపికా సోషల్ మీడియా వేదికగా ఒక సినిమా తీసే అనుభ‌వం,ఆ సినిమా చేసే వ్య‌క్తులు, దాని విజ‌యం కంటే చాలా ముఖ్యం. అంత‌కుమించి అంగీక‌రించ‌లేను. అప్ప‌టి నుంచి నేను ఇదే నియ‌మాన్ని అనుస‌రిస్తున్నాను అని క్రిప్టిక్ పోస్ట్‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

దీపిక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee),సన్ పిక్చర్స్(Sun Pictures)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో చేస్తుంది.దీంతో పాటు షారుక్ అప్ కమింగ్ మూవీ 'కింగ్' లో చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. షూటింగ్ కి సంబంధించి కాల్ షీట్స్ లో దీపికా కొన్ని కండిషన్స్ చెప్తుందని, అందుకే ఆమెని స్పిరిట్ నుంచి తప్పించారని ప్రచారమైంది. దీపికా తన కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ని సైతం అందుకొని భారతీయ సినీ ప్రపంచం యొక్క పేరు ప్రఖ్యాతులని ప్రపంచ సినీ యవనిక పై నిలబెట్టింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.