English | Telugu

రిలీజ్ టైంలో షాకిచ్చిన ఓజీ మేకర్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా మార్కెట్ అనేది కీలకం. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు అక్కడ ఫుల్ రన్ లో 1 మిలియన్ క్లబ్ లో చేరేవి. కానీ, ఇప్పుడు ప్రీమియర్స్ తోనే 2-3 మిలియన్ క్లబ్స్ లో చేరుతున్నాయి. దీంతో మేకర్స్ నార్త్ అమెరికా మార్కెట్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం కంటెంట్ ఆలస్యంగా పంపి.. రికార్డు వసూళ్లు రాబట్టే అవకాశాన్ని చేతులారా మిస్ చేసుకుంటున్నారు. తాజాగా 'ఓజీ' సినిమా విషయంలో అదే జరుగుతోంది. (They Call Him OG)

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' సెప్టెంబర్ 25న విడుదల కానుంది. అమెరికాలో రేపు(సెప్టెంబర్ 24) ప్రీమియర్స్ పడనున్నాయి. ప్రీమియర్స్ కి ఇంకా ఒక్క రోజు కూడా సమయం లేదు. అయినప్పటికీ ఇంతవరకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి పూర్తి కంటెంట్ అందలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రమే వారికి చేరింది. సెకండ్ హాఫ్ ఇంకా చేరలేదు. ఇలా కంటెంట్ ఆలస్యమవ్వడం వల్ల పలు షోలు క్యాన్సిల్ అయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఏఎంసీ థియేటర్స్ కంటెంట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాయి. కంటెంట్ అందితే కానీ, షోలు షెడ్యూల్ చేయవు. దీంతో ప్రీమియర్స్ కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. (Pawan Kalyan OG)

నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ పరంగా ఇప్పటికే 'ఓజీ'.. 2.2 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది. కంటెంట్ సరైన టైంకి చేరి, అన్ని షోలు ఓపెన్ అయినట్లయితే.. ప్రీమియర్స్ ద్వారానే 3.5 మిలియన్ డాలర్స్ సాధించేదని ట్రేడ్ వర్గాల అంచనా. అదే జరిగితే 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప-2' రికార్డులను 'ఓజీ' బ్రేక్ చేసి ఉండేది. (OG USA)

నార్త్ అమెరికా ప్రీమియర్స్ పరంగా 3.9 మిలియన్ తో 'కల్కి 2898 AD' టాప్ లో ఉండగా.. 3.5 మిలియన్ తో ఆర్ఆర్ఆర్, 3.3 మిలియన్ తో పుష్ప-2, 2.8 మిలియన్ తో దేవర, 2.6 మిలియన్ తో సలార్.. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 'ఓజీ' సినిమాకి టాప్-2లో నిలిచే సత్తా ఉండగా.. కంటెంట్ డిలే కారణంగా, ఇప్పుడు టాప్-5తో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు.. మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ కి కొన్ని గంటల ముందు వరకు.. కంటెంట్ పంపకుండా ఏం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.