English | Telugu

వెంటిలేటర్‌పై ఫిష్‌ వెంకట్‌.. పరిస్థితి విషమం!

సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన కొందరు.. చివరి దశలో దీనావస్థకి రావడం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఎన్నో కన్నీటి గాధల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే నటుడు ఫిష్‌ వెంకట్‌కి వచ్చింది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను వెంటిలేటర్‌పై ఉన్నారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్య ఖర్చుల కోసం సహాయాన్ని అర్థిస్తున్నారు కుటుంబ సభ్యులు.

తెలుగు సినిమాల్లో ఎస్‌ బాస్‌ వంటి క్యారెక్టర్లు చెయ్యడంలో ఫిష్‌ వెంకట్‌కి మంచి పేరు ఉంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్‌ వెంకట్‌ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించారు. స్టార్‌ హీరోలందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్‌ సొంతం. తన నటనతో అందర్నీ నవ్వించిన వెంకట్‌ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అతను చివరగా చేసిన సినిమా నరకాసుర. అనారోగ్యం కారణం వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీంతో అతని కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.