English | Telugu

చిరంజీవి పేరు వాడితే చర్యలు తప్పవు.. టీమ్ సంచలన ప్రకటన!

టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ రాకతో సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఫేక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఏఐ పుణ్యమా అని ఏవి ఫేకో, ఏవి ఒరిజినలో కూడా అర్థంకాని పరిస్థితి. వీటి వల్ల సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వారిని ట్రోల్ చేసేలా ఉంటే, మరికొన్ని వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. (Chiranjeevi)

తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ ఉపయోగించడం, ఏఐ క్రియేషన్స్ చేయడంపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారు చిరంజీవి. ఈ మేరకు చిరంజీవి టీమ్ కీలక ప్రకటన చేసింది. ట్రోల్స్, మార్ఫ్ లు, ఏఐ దుర్వినియోగం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

"హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చిరంజీవి గారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఈ ఉత్తర్వు ప్రకారం ఎవరైనా చిరంజీవి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే విధంగా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌, ఏఐ క్రియేషన్ వంటివి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం నిషేధించబడింది. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 27 కి వాయిదా వేసింది. ట్రోలింగ్‌, మార్ఫింగ్‌, అభ్యంతరకర కంటెంట్‌ ప్రచారం, లేదా అనుమతిలేని వాణిజ్య వినియోగం పట్ల చట్టపరమైన చర్యలు ఉంటాయి." అని చిరంజీవి టీమ్ ప్రకటనలో పేర్కొంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.