English | Telugu

పవన్ కళ్యాణ్‍ తీన్ మార్ ఆడియో ఎక్కడ...?

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో ఎక్కడ జరుగుతుంది...? పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారు. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "జల్సా" చిత్రానికి కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆ చిత్రం ఆడియో ఎంత పెద్ద హిట్టయ్యిందో మనకు తెలిసిందే. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో కూడా ఆ రేంజ్ కి తగ్గకుండా దేవీ శ్రీ ప్రసాద్ అందించినట్లు తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం యోక్క ఆడియోని ఎక్కడ విడుదల చేయబోతున్నారనేది మిలియన్‍ డాలర్ క్వశ్చిన్ గా మిగిలింది. ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అశేష అభిమానుల సమక్షంలో, అత్యంత ఘనంగా విడుదల చేయాలని నిర్మాత గణేష్ ఆలోచిస్తున్నారు.

అయితే ఏ ప్రదేశంలో ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం ఆడియోని విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారట. మన హైదరాబాద్ లో ఇలాంటి భారీ వేడుకలకు మాదాపూర్ లో హైటెక్స్, శిల్పకళా వేదిక, లాల్ బహదూర్ స్టేడియం, గోల్కొండ టూంబ్స్ వద్ద కల తారామతి బరాదరి ఇవన్నీ కాకపోతే షంషాబాద్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఎక్కడ విడుదల చేస్తారో వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.