English | Telugu
రామ్ చరణ్ సినిమాతో అంబటికి లింకేంటి?
Updated : Nov 13, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో బిగ్ బాస్ ఫేమ్ అంబటి అర్జున్ నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు బుచ్చిబాబు రివీల్ చేశాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్-7 ఆసక్తికరంగా సాగుతోంది. ఈ షో దీపావళి స్పెషల్ ఎపిసోడ్ కి డైరెక్టర్ బుచ్చిబాబు గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా అర్జున్ కి, బుచ్చిబాబుకి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. "ఉప్పెన సినిమాకి జాతీయ అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని విష్ చేయడానికి రెండు మూడు సార్లు మీ ఆఫీస్ కి వచ్చాను. కానీ అప్పుడు మీరు చెన్నై వెళ్ళారు. ఇంతలో నేనిలా బిగ్ బాస్ కి వచ్చాను" అని అర్జున్ చెప్పగా.. "రామ్ చరణ్ గారి సినిమాలో నువ్వొక సూపర్ క్యారెక్టర్ చేయబోతున్నావు" అని బుచ్చిబాబు అన్నాడు. దాంతో అంబటి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంతేకాదు, ఆ సమయంలో తాను ఏఆర్ రెహమాన్ గారిని కలవడానికి చెన్నై వెళ్ళానని బుచ్చిబాబు తెలిపాడు. అధికారిక ప్రకటన రానప్పటికీ 'RC 16' చిత్రానికి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. ఇప్పుడు బుచ్చిబాబు కామెంట్స్ తో అది కన్ఫర్మ్ అయింది.