English | Telugu
ఉగాదికి చిరు,అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్..హీరోయిన్ గా ప్రముఖ హీరో భార్య!
Updated : Mar 26, 2025
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం చేస్తున్న 'విశ్వంభర'(Vishwambhara)తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం'ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.షూటింగ్ స్టార్టింగ్ కాకముందే 2026 సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు.దీంతో అనిల్ రావిపూడి ఈ మూవీకి సంబంధించిన అన్ని విభాగాలకి చెందిన పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ మూవీ ఈ నెల 30 న పూజా కార్యక్రమాలతో ఉగాది రోజున ప్రారంభం కానుంది.ఆ తర్వాత జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చాలా కాలం తర్వాత చిరు కుటుంబ నేపథ్యంతో పాటు పూర్తి వినోదాత్మకంతో కూడిన కథలో చేస్తుండటం,అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తి నెలకొని ఉంది.చిరు తరహా యాక్షన్ సన్నివేశాలకి కూడా లోటు లేని విధంగా అనిల్ స్క్రిప్ట్ ని రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది.చిరు సరసన ఇద్దరు హీరోయిన్లు చేస్తున్నారని,ఒక హీరోయిన్ గా అదితిరావు హైదరి చేస్తుందనే ప్రచారం జరుగుతుంది.అదితి పలు తెలుగు,హిందీ భాషల్లో ఎన్ని సినిమాలు చేసింది.ఇటీవల ప్రముఖ హీరో సిద్దార్ధ్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ మెగా చిత్రాన్ని బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి ని నిర్మించి హిట్ ని అందుకున్న'సాహు గారపాటి',చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.'సంక్రాంతికి వస్తున్నాం'ని మ్యూజికల్ హిట్ గా కూడా నిలిపిన భీమ్స్ సిసోరియా(Bheems Ceciroleo)సంగీతాన్నిఅందిస్తున్నాడు.