English | Telugu
నయనతారపై వస్తున్న రూమర్స్ కి రెస్ట్..అగ్ర దర్శకుడి భార్య రంగంలోకి
Updated : Mar 26, 2025
స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara)ప్రస్తుతం 2020 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న'మూకుత్తి అమ్మన్'(Mookuthi Amman)కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'మూకుత్తి అమ్మన్ 2 (Mookuthi Amman 2)లో చేస్తున్న విషయం తెలిసిందే.మొదటి భాగం 'అమ్మోరు తల్లి'గా తెలుగులోకి కూడా డబ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ప్రముఖ నటుడు,దర్శకుడు ఆర్జే బాలాజీ పార్ట్ 1 కి దర్శకత్వం వహించగా, రెండవ భాగానికి సీనియర్ దర్శకుడు సుందర్ సీ(Sundar c)దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా అసిస్టెంట్ డైరెక్టర్,నయనతారకి మధ్య లొకేషన్ లో గొడవ జరిగిందని, దీంతో సుందర్ షూట్ ని ఆపేశారనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇప్పుడు ఈ విషయంపై సుందర్ వైఫ్ ప్రముఖ నటి ఖుష్బూ 'ఎక్స్' వేదికగా స్పందిస్తు రూమర్స్ సృష్టించే వాళ్ళు రెస్ట్ తీసుకోండి.ఎందుకంటే ఇలాంటి రూమర్స్ ని సుందర్ అసలు పట్టించుకోరు.అనుకున్న ప్రకారమే మూకుత్తి అమ్మన్ 2 రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటుంది.నయనతార చాలా మంచి నటి.గతంలో ఆమె చేసిన క్యారక్టర్ ని మళ్ళీ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.మా సినిమాకి ఎప్పడు మీ సపోర్ట్ కావాలి.సుందర్ నుంచి మరో బ్లాక్ బస్టర్ వస్తుంది రెడీ గా ఉండండని ట్వీట్ చేసింది.దీంతో మూకుత్తి అమ్మన్ 2 షూట్ ఆగిందనే న్యూస్ నిజంగానే రూమర్ గా మిగిలింది.
తమిళనాట ఉన్న అగ్ర దర్శకుల్లో సుందర్ సి కూడా ఒకరు.రజనీకాంత్ హిట్ మూవీ 'అరుణాచలం' మూవీకి సుందర్ నే దర్శకుడు.అదే పేరుతో తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.కమల్ హాసన్,శరత్ కుమార్ వంటి అగ్ర హీరోలతో కూడా సుందర్ సినిమాలని తెరకెక్కించాడు.సుమారు 30 సినిమాల దాకా ఆయన లిస్ట్ లో ఉన్నాయి.