English | Telugu

పౌరాణిక సినిమాలో అల్లు అర్జున్..ఈ దేవుడు గురించి తెలుసా మీకు  

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu Arjun)పుష్ప 2(Pushpa 2)తర్వాత త్రివిక్రమ్(trivikram)తమిళ దర్శకుడు అట్లీ(Atlee)తో తన తదుపరి చిత్రాలు కమిట్ అయిన విషయం తెలిసిందే.కొన్నినెలల క్రితం త్రివిక్రమ్ మూవీ అధికారకంగా ప్రారంభమయ్యింది.దీంతో త్రివిక్రమ్ మూవీనే ముందుగా సెట్స్ పైకి వెళ్తుందని అందరు భావించారు.కానీ అట్లీ మూవీనే ముందుగా షూట్ కి వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది.ఏది ఏమైనా అల్లుఅర్జున్ తదుపరి చెయ్యబోయే సినిమా విషయంలో మరికొన్నిరోజుల్లో క్లారిటీ రానుంది.

అల్లుఅర్జున్,త్రివిక్రమ్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై చినబాబు,నాగవంశీ(Nagavamsi)నిర్మిస్తున్నారు.రీసెంట్ గా నాగవంశీ ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు బన్నీ,త్రివిక్రమ్ మూవీ పౌరాణిక చిత్రంగా తెరకెక్కనుంది.మన పురాణాల్లో ఒక దేవుడు గురించి అందరకి తెలిసినప్పటికీ,ఆయన జీవితంలో ఏం జరిగిందో పెద్దగా ఎవరకి తెలియదు.ఆ కోణాన్నే మా చిత్రంలో భారీగా చూపించబోతున్నాం.అలా అని అల్లుఅర్జున్ క్యారక్టర్ పూర్తిగా ఫిక్షనల్ ఏమి కాదు.తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాలని తెరకెక్కించడం ఎందుకు ఆపేసిందో అర్ధం కావడం లేదు.మేము నిర్మించే ఈ మూవీ స్థాయిని చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోతుందని చెప్పుకొచ్చాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్,అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి,సన్ ఆఫ్ సత్య మూర్తి,అల వైకుంఠపురం వంటి చిత్రాలు వచ్చి ఒక దాన్ని మించి ఒకటి విజయం సాధించాయి.దీంతో రాబోయే మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు.నాగ వంశీ మాటలు అంతకు మించి ఉండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.