English | Telugu
చెర్రీ పెళ్ళి హైదరాబాద్ లో రిసెప్షన్ తిరుపతిలో
Updated : Dec 15, 2011
చెర్రీ పెళ్ళి హైదరాబాద్ లో రిసెప్షన్ తిరుపతిలో జరుగనున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ఏకైక కుమారుడు, ఆయన నటవారసుడు అయిన మెగాపవర్ స్టార్ చెర్రీ రామ్ చరణ్ తేజ వివాహం తను ప్రేమించిన ఉపాసన తో జరుగనుందన్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ మధ్యే వీరిద్దరి వివాహం తాలూకు ఎంగేజ్ మెంట్ కూడా ఘనంగా జరిగింది. వీరి వివాహం హైదరాబాద్ లోనే జరుగుతుంది.
కానీ వీరి పెళ్ళి రిసెప్షన్ మాత్రం చిరంజీవి యమ్.యల్.ఎ. గా గెలుపొందిన తిరుపతి నియోజకవర్గంలోనే జరుగుతుందని తెలిసింది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో, రామ్ చరణ్ "రచ్చ" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. దీని తర్వాత వి.వి.వినాయక్ చిత్రంలో కూడా హీరోగా నటించేందుకు రామ్ చరణ్ అంగికరించిన సంగతి తెలిసిందే.