English | Telugu

బాలీవుడ్‌లో బ‌న్నీ స్టెప్పులేస్తాడా?

టాలీవుడ్‌లో బెస్ట్ డాన్స‌ర్ ఎవ‌రేంటే అల్లు అర్జున్ పేరు చెప్పాల్సిందే. టాలీవుడ్ అనేంటి?? ద‌క్షిణాదిలోనే బ‌న్నీ సూప‌ర్ డాన్స‌ర్‌. బ‌న్నీ స్టెప్పుల‌కు మ‌ల్లూవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇప్పుడు బ‌న్నీ టాలెంట్ బాలీవుడ్‌కీ తెలియ‌బోతోంది. ఎందుకంటే త్వ‌ర‌లోనే ఈ అల్లువారి పిల్ల‌డు బాలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడు. ప్రభుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాలీవుడ్ చిత్రం ఏబీసీడీ 2. ఈ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంది. అందులో బాలీవుడ్ స్టార్లంతా స్టెప్పులు వేయ‌బోతున్నార‌ట‌. ఆ పాట‌లో బ‌న్నీ కూడా క‌నిపిస్తాడ‌ని టాక్‌. బ‌న్నీకి ప్ర‌భుదేవాకి మంచి అనుబంధం ఉంది. ప్ర‌భుదేవా డాన్సులంటే బ‌న్నీకి చాలా ఇష్టం. బ‌న్నీ స్టైల్ అన్నా ప్ర‌భుకి ఇష్ట‌మే. ఈ అనుబంధంతోనే బ‌న్నీ ఏబీసీడీలో క‌నిపించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ట‌. ఓ పాట‌లో బాలీవుడ్ స్టార్ల‌తో పాటు బ‌న్నీ కూడా త‌ళుక్కున మెరుస్తాడ‌ట‌. మొత్తానికి బ‌న్నీ బాలీవుడ్ ఎంట్రీ ఖాయ‌మైంద‌న్న‌మాట‌. మ‌రి త‌న స్టెప్పుల‌తో , స్టైల్స్‌తో అక్క‌డ ఇంకెంతమంది అభిమానుల్ని సంపాదించుకొంటాడో చూడాలి.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.