English | Telugu

‘ఆర్సీ 15’ రూపంలో ‘ప్రాజెక్ట్ కె’ కి ప్ర‌మాదం పొంచి ఉంది!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా నుండి పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ కి ఎదిగిపోయారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్సీ 15 చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతోంది. రెగ్యులర్ మూవీ లవర్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ స్టైల్ లో సోషల్ మెసేజ్ ఉంటుందట. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కావాల్సిన ఉంటాయని అంటున్నారు. రామ్ చరణ్ కు సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల అని వార్తలు వచ్చాయి.

దిల్ రాజు వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఆయనకు సంక్రాంతి అంటే బాగా అచ్చొచ్చిన పండగ. అదే నిజమైతే రామ్ చరణ్- ప్రభాస్ పోటీ పడాల్సి వస్తుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ ప్రాజెక్టు కే మూవీ రూపొందుతోంది. 2024 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12 వ తారీఖున విడుదల కానుంది. ఆర్సి15 సినిమాతో రామ్ చరణ్ ప్రభాస్ లు పోటీ పడతారా ? లేక ఎవ‌రైనా త‌గ్గి స‌మ్మ‌ర్ కి షిఫ్ట్ అవుతారా? అనే చ‌ర్చ సాగుతోంది.

ప్రాజెక్టుకే రిలీజ్ డేట్ ను జనవరి 12న నిర్ణయించి పోస్ట‌ర్ విడుదల చేశారు. కానీ ఈసారి వారీసు లాగానే వచ్చే ఏడాది కూడా పొంగల్ రేసులో దిల్ రాజు తన చిత్రాన్ని బ‌రిలో దింపే అవ‌కాశం ఉంది. అందునా శంక‌ర్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఈ చిత్రానికి కోలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ వ‌చ్చే అవ‌కాశం ఉండేలా చూసుకుంటారు అని ఖచ్చితంగా తెలుస్తుంది. కాగా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆర్సీ 15, ప్రాజెక్ట్ కెల మ‌ధ్య సంక్రాంతికి హోరాహోరీ పోరు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.