English | Telugu

ఆగస్టులో రెండో లూసిఫర్‌... లాల్‌ రెడీ!

మోహన్‌లాల్‌ హీరోగా తెరకెక్కిన సినిమా లూసిఫర్‌. మలయాళంలో సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. పృథ్విరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌, మంజు వారియర్‌, టొవినో థామస్‌ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను తెలుగులో గాడ్‌ఫాదర్‌ పేరుతో విడుదల చేస్తే, ఇక్కడ కూడా మంచి పేరే తెచ్చుకుంది. లేటెస్ట్‌గా లూసిఫర్‌ సీక్వెల్‌కి కాల్షీట్‌ అలాట్‌ చేశారు మోహన్‌లాల్‌.

ఈ మధ్యనే తన మలైకోట్టై వాలిబన్‌ సినిమాకు సంబంధించి రాజస్థాన్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నారు. మరోవైపు జైలర్‌ సినిమా షూటింగ్‌లోనూ పార్టిసిపేట్‌ చేస్తున్నారు. ఇవన్నీ పూర్తి చేసుకుని ఆగస్టులో లూసిఫర్‌ సీక్వెల్‌ సెట్స్‌కి వస్తానని మాటిచ్చారట మోహన్‌లాల్‌. ఈ సినిమాకు ఎల్‌2 ఎంపురాన్‌ అనే పేరు పెట్టారు పృథ్విరాజ్‌ సుకుమారన్‌. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి లొకేషన్లు కూడా చూశారు. కేరళలోని అందమైన ప్రదేశాలతో పాటు హైదరాబాద్‌, ముంబైలోనూ కీ పోర్షన్‌ తీయనున్నారు. రష్యా ప్రధానంగా మిగిలిన కథను నడిపించడానికి రెడీ అవుతున్నారు. ఈ సారి మెగా బడ్జెట్‌తో మూవీని ప్లాన్‌ చేస్తున్నారు పృథ్విరాజ్‌. టొవినో థామస్‌, సాయికుమార్‌, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, బైజు సంతోష్‌, నందు, నైలా ఉషా, సానియా ఐయ్యప్పన్‌తో పాటు మిగిలిన నటీనటులందరూ ఈ పార్ట్ లోనూ కనిపిస్తారట. మురళీగోపీ స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఆంటోని పెరుంబవూర్‌ తన ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై నిర్మిస్తున్నారు.

సెకండ్‌ పార్ట్ ని తెలుగులో రిలీజ్‌ చేస్తారా? లేకుంటే రీమేక్‌ రైట్స్ అమ్ముతారా అనే విషయం మీద తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. లూసిఫర్‌ని గాడ్‌ఫాదర్‌గా విడుదల చేసిన మోహన్‌లాల్‌, సెకండ్‌ పార్ట్ విషయంలో ఎలా స్పందిస్తారోననే ఆసక్తి నెలకొంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.