English | Telugu

ఎన్టీఆర్‌.... నీకెవ‌రూ దొర‌క‌లేదా?

అస‌లే బుడ్డోడు.. వ‌రుస ఫ్లాప్‌ల‌తో నిలువునా మునిగిపోయాడు. ఇప్పుడు అర్జెంటుగా ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కావాలి. త‌న ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి. ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్‌. ఆ సినిమా ఎన్టీఆర్‌కి చాలా కీల‌కం. కానీ.. ఆ సినిమాపై న‌మ్మ‌కాలు పెట్టుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే పూరి ఎప్పుడు, ఎలాంటి సినిమా తీస్తాడో చెప్ప‌లేం. ప‌రిశ్ర‌మ‌కు షాక్ ఇచ్చే హిట్ ఇవ్వ‌గ‌ల‌డు, చెత్త సినిమానీ అందివ్వ‌గ‌ల‌డు. అయితే ఆంధ్రావాలా, లేదంటే పోకిరి అన్న‌మాట‌. సో... పూరి సినిమా జూదం లాంటిదే. ఆ త‌ర‌వాతైనా స‌రైన స్టెప్ వేస్తున్నాడా, అంటే అదీ లేదు..! ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే బొమ్మ‌రిల్లు భాస్కర్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. బెంగ‌ళూర్ డేస్ చిత్రానికి ఇది రీమేక్ కూడా కావ‌చ్చ‌ని తెలుస్తోంది. బొమ్మ‌రిల్లు త‌ర‌వాత భాస్క‌ర్ అద‌రొట్టిందేం లేదు. ప‌రుగు ఓకే అనిపించింది. ఆరెంజ్‌.... చ‌ర‌ణ్ కెరీర్‌తో ఓ రేంజ్‌లో ఆడుకొంది. ఒంగోలు గిత్త ప‌చ్చ‌డి ప‌చ్చ‌డి అయిపోయింది. భాస్క‌ర్ అంటేనే అటు నిర్మాత‌లు, ఇటు హీరోలు భ‌య‌ప‌డే స్థాయికి చేరుకొంది ప‌రిస్థితి. అలాంటి భాస్క‌ర్‌ని ఎన్టీఆర్ ఎలా న‌మ్ముతాడో అభిమానుల‌కు సైతం అర్థం కావ‌డం లేదు. ఒక వేళ ఈసినిమా ఒప్పుకొంటే... ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది మ‌రో బ్లండ‌ర్ మిస్టేక్ అవుతుంద‌ని ఎన్టీఆర్ వీర ఫ్యాన్స్ కూడా తెగ బాధ‌ప‌డిపోతున్నారు. మ‌రి చివ‌ర‌కు ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటాడో, ఏమిటో....??

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.