English | Telugu

బేబీ కాంబో రిపీట్... ఏడుస్తున్న వైష్ణవి చైతన్య

సిల్వర్ స్క్రీన్‌పై ఓసారి హిట్ అయితే చాలు, మన మేకర్స్ ఆ జోడీని రిపీట్ చేయటానికి అస్సలు ఏం మాత్రం ఆలోచించరు. అలా రీసెంట్ టైమ్‌లో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. వీరిద్దరూ కలిసి నటించిన బేబి చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగత తెలిసిందే. తర్వాత వైష్ణవితో సినిమాలు చేయటానికి మన నిర్మాతలు ఆసక్తిని చూపించారు. అయితే ఆమె మాత్రం మరోసారి హిట్ కాంబినేషన్‌ వైపుకే మొగ్గు చూపించింది. బేబి సినిమాను రూపొందించిన సాయి రాజేష్ రైటర్‌గా ఆనంద్ దేవరకొండతో వైష్ణవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రిలీజ్ వరకు పెద్దగా బజ్ లేని బేబి సినిమాకు, రిలీజ్ తర్వాత వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య నటన అందరినీ మెప్పించింది. నేటి యువత మనస్తత్వాన్ని చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సాయి రాజేష్. యూత్ సినిమాకు బాగా కనెక్ట్ కావటంతో బేబి మూవీ ఏకంగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 90 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన బేబి ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవటం ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు బేబి దర్శకుడు సాయి రాజేష్ రైటర్, నిర్మాత ఎస్.కె.ఎన్‌తో కలిసి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసి బేబి కాంబో రిపీట్ కానుందంటూ ప్రకటనను విడుదల చేసింది. పోస్టర్‌ను గమనిస్తే ఏడుస్తున్న వైష్ణవి చైతన్యను ఆనంద్ దేవరకొండ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. రైటర్, అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రవి నంబూరి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు మరి. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తన్నట్లు దర్శక నిర్మాతలు తెలియజేశారు. మరి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో వెండితెరపై చూడాల్సిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.