English | Telugu
బిగ్ బాస్ సీజన్-7 కి సెలెక్ట్ అయ్యింది వీళ్ళేనా!
Updated : May 2, 2023
బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరెట్ రియాలిటీ షో. అయితే బిగ్ బాస్ ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్ లను పూర్తి చేసుకొని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ కి హోస్ట్ గా పలువురు స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి గత సీజన్లకి హోస్ట్ గా చేసిన నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నట్లుగా సమాచారం.
అయితే బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేయడమంటే మాములు విషయం కాదు.. లక్షల్లో ఒకరికి ఈ అవకాశం వస్తుంది. బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసి ఫేమ్ సంపాదించిన వారి లిస్ట్ ఎక్కువే. తమిళ్ బిగ్ బాస్ ఇప్పటికే 16 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. దీన్ని బట్టి బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. బిగ్ బాస్-7 లో ప్రతి క్యాటగిరి నుండి ఒక్కరు లేదా ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ లోకి పంపించేందుకు సెలక్షన్ ప్రాసెస్ కోసం కంటెస్టెంట్స్ ని అప్రోచ్ అయ్యారంట. అందులో కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ యాక్టర్ మహేష్.. గత సీజన్ లో కీర్తిభట్ ని ఫ్యామిలీ వీక్ లో మీట్ అయిన ఇతను.. ఈ సీజన్ కి ఎంట్రీ ఇస్తున్నాడంట. సీరియల్ యాక్టర్ అమరదీప్ చౌదరి, సిద్ధార్థ్ వర్మ, యాంకర్ విష్ణుప్రియ, యాక్టర్ సాయి రోనాక్, ఢీ జోడి డ్యాన్సర్ పండు, జబర్దస్త్ అప్పారావు, యూట్యూబర్ నిఖిల్, యాక్టర్ ఈటీవీ ప్రభాకర్, సింగర్ సాకేత్.. ప్రస్తుతానికి వీళ్ళ పేర్లు వినిపిస్తుండగా.. ఈ సీజన్ కి ఎంత మందిని హౌస్ లోకి పంపిస్తారనే విషయం ఆసక్తిని కలిగిస్తుంది.
అన్ని సీజన్లలో కంటే గత సీజన్ లోనే 21 మంది కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించారు మేకర్స్. ఇప్పుడు అదే తరహాలో సాగనుందా లేదా తెలియాల్సి ఉంది. కాగా ఈ సీజన్ ఇప్పటికే సెలక్షన్ ప్రకియ పూర్తయినట్టుగా తెలుస్తుంది. జులైలో బిగ్ బాస్ సీజన్-7 గ్రాండ్ గా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సారి బిగ్ బాస్-7 బాగుంటుందని భారీ అంచనాలతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్-7 ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.