English | Telugu

భైరవం ఓటిటి డేట్ వచ్చేసింది.. ఆరోజు పండగే 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai srinivas)మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith)కాంబోలో మే 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ భైరవం(Bhairavam). యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి నాంది, ఉగ్రం చిత్రాల ఫేమ్ 'విజయ్ కనకమేడల' దర్శకత్వం వహించాడు. ఆదితి శంకర్‌, దివ్యా పిళ్లై, ఆనంది, జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహిత్సవ ఇతర పాత్రల్లో కనిపించారు.

ఇప్పుడు ఈ మూవీ జూలై 18 నుంచి ఓటిటి వేదికగా జీ 5 (Zee 5)లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్ లో అందుబాటులో ఉండనుంది. థియేటర్స్ లో మంచి అదరణనే దక్కించుకున్న భైరవం ఓటీటీ లో కూడా అంతే ఆదరణని దక్కించుకుంటుందనే ఆశాభావంతో చిత్ర బృందం ఉంది. శీను, గజపతి వర్మ, వరద అనే ప్రాణ స్నేహితుల క్యారెక్టర్స్ లో సాయి శ్రీనివాస్, మనోజ్, రోహిత్ లు తమ కెరీర్ లోనే భైరవం ద్వారా అత్యుత్తమ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ సహజ నటనతో మూవీకి నిండు తనాన్ని తీసుకొచ్చారు. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల్ని రాజకీయ నాయకుడు ఆక్రమించాలని అనుకుంటాడు.

ఆ భూమిని కాపాడేందుకు శీను, గజపతి వర్మ, వరద ఏమైనా ప్రయత్నాలు చేసారా? లేక రాజకీయం వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టి గుడి భూముల విషయంలో వేరు వేరు నిర్ణయాలు తీసుకునేలా చేసిందా? చివరకి ఆ ముగ్గురు పాత్రలు ఎలా ముగుస్తాయి? అనే పాయింట్స్ తో భైరవం తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.