English | Telugu

బాక్సాఫీస్ అమ్మ మొగుడు బాలయ్య..మొదటి రోజు 32 .33 కోట్లు 

ఎందుకు మా బాలయ్య రికార్డు లని ఎవరు టచ్ చెయ్యలేరని నందమూరి అభిమానులు అంటారో ఇప్పుడు అందరికి అర్ధం అయ్యింది. నందమూరి బాలకృష్ణ వన్ మాన్ షో భగవంత్ కేసరి మూవీ సాధించిన తొలి రోజు కలెక్షన్ల సాక్షిగా అందరికి క్లియర్ గా అర్ధం అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో తెలుగు చలన చిత్ర సీమలో బాలయ్య సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. ఇది కదా మా బాలయ్య పవర్ అని నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తు మరి దసరా సెలెబ్రేషన్స్ ని భగవంత్ కేసరి మూవీ తో ప్రారంభించారు. సింహం జూలు విదిలిస్తే ఎలా ఉంటుందో ఆ సింహం యొక్క శ్వాస ఎంత వేడిగా ఉంటుందో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కి బాలయ్య రుచి చూపించాడు. భగవంత్ కేసరి లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించి రికార్డు కలెక్షన్స్ ని సింహంలా కొల్లగొట్టాడు.

భగవంత్ కేసరి మూవీ నిన్న ప్రపంచం వ్యాప్తంగా పన్నెండొందల థియేటర్స్ కి పైగా రిలీజ్ అయ్యింది .రిలీజ్ అయిన అన్ని చోట్ల ప్యూర్ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. అలాగే తొలి రోజు రికార్డు స్థాయి వసూళ్ళని రాబట్టింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో తొలి రోజు 32 .33 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసులు చేసి బాక్స్ ఆఫీస్ ని చెడుగుడు ఆడుకుంది. బాలయ్య సాధించిన ఈ రికార్డు తో ఇప్పుడు తెలుగు దేశం మొత్తం జై బాలయ్య అని అంటుంది. అసలే నెల చివర పైగా దసరా హడావిడితో ఆ ఊరు ఈ ఊరు అని టూర్ వెళ్లే జనం అయినా కూడా అందరు మా బాలయ్య సినిమా చూడాలి అన్నట్టుగా తండోప తండాలుగా భగవంత్ కేసరి కోసం థియేటర్ల ముందు క్యూ కట్టారు.ఇప్పుడు సినిమా ని సూపర్ హిట్ చేసారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దసరా విన్నర్ గా బాలకృష్ణ నిలిచినట్లే. రిలీజ్ అయిన అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ తో భగవంత్ కేసరి ముందుకు దూసుకెళ్తున్నాడు. అన్ని ఏరియాల్లో బాలయ్య నటనకి చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా అందరు బ్రహ్మరధం పడుతున్నారు. బాలయ్య జోరు ఇలాగే కొనసాగితే భగవంత్ కేసరి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మరిన్ని కొత్త రికార్డు లని సృష్టించడం ఖాయం. ఆల్రెడీ ఇప్పటికే అఖండ ,వీర సింహ రెడ్డి లతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టు అయ్యింది. అలాగే నందమూరి అభిమానులంతా జై బాలయ్య అంటూ బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ ద్వారా సృష్టించే సరి కొత్త రికార్డు ల కోసం వెయిట్ చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.