English | Telugu

సెంచ‌రీ కొట్టిన స‌లార్ టీజ‌ర్.. ఆగ‌స్టులో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రైల‌ర్!!

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన 'స‌లార్' (పార్ట్ - 1) టీజ‌ర్.. యూట్యూబ్ ముంగిట రికార్డుల మోత మ్రోగిస్తోంది. క‌థానాయ‌కుడు ప్ర‌భాస్ పాత్ర‌ని ఎలివేట్ చేస్తూ.. సీనియ‌ర్ యాక్ట‌ర్ టినూ ఆనంద్ నోట ప‌లికించిన 'సింపుల్ ఇంగ్లిష్' డైలాగ్,కెప్టెన్ ప్ర‌శాంత్ నీల్ మార్క్ విజువ‌ల్స్ప‌దే ప‌దే ఈ టీజ‌ర్ ని వీక్షించేలా చేసి.. రెండు రోజుల్లో '100 మిలియ‌న్వ్యూస్' మార్క్ చేరువ‌య్యేలా చేశాయి.

'స‌లార్' టీజ‌ర్ కి ల‌భిస్తున్న విశేషాద‌ర‌ణ దృష్ట్యా చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌ళే ఫిల్మ్స్ ట్విట్ట‌ర్ వేదిక‌గా.. రికార్డు వ్యూస్ కి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. అంతేకాదు.. ''మీ క్యాలెండ‌ర్ లో ఆగ‌స్టు నెల‌ని మార్క్ చేసుకోండి. భారతీయ సినిమా వైభ‌వాన్ని చాటిచెప్పే అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన ట్రైల‌ర్ మీ కోసం వ‌స్తోంది'' అంటూ కొత్త క‌బురు పంచుకుంది. అలాగే, మ‌న ఇండియ‌న్ సినిమాశ‌క్తిని చాటిచెప్పే ఈ ఆనంద‌క‌ర‌మైన ప్ర‌యాణాన్ని క‌లిసి కొన‌సాగిద్దాం అంటూ రాసుకొచ్చింది హోంబ‌ళే ఫిల్మ్స్.

కాగా, 'స‌లార్'లో ప్ర‌భాస్ కి జోడీగా శ్రుతి హాస‌న్ క‌నిపించ‌నుండ‌గా పృథ్వీరాజ్ సుకుమార‌న్, జ‌గ‌ప‌తి బాబు, శ్రియా రెడ్డి, మ‌ధు గురుస్వామి, ఈశ్వ‌రీ రావు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. 'కేజీఎఫ్'ఫేమ్ ర‌వి బ‌స్రూర్ సంగీత‌మందిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 28న 'స‌లార్ పార్ట్ 1- Ceasefire'ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.