English | Telugu

అందంగా ఉండ‌టానికి శ్రియ ఏం తింటారో తెలుసా?


అప్పుడెప్పుడో 2001లో ఇష్టం సినిమాతో స్క్రీన్ మీద‌కు వ‌చ్చారు శ్రియా. ఆమెతో న‌టించిన హీరోలంద‌రికీ ఏజ్ బార్ అవుతోంది కానీ, శ్రియ మాత్రం ఇప్ప‌టికీ అదే అందంతో మెప్పిస్తున్నారు. రీసెంట్‌గా ఓ వేదిక మీద ఆమె చీర‌క‌ట్టుతో క‌నిపించిన ఫొటోలు, పైట తీసి కుర్ర‌కారును రెచ్చ‌గొట్టిన విధానం నెట్టింట్లో క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోయింది. అస‌లు శ్రియా అంత అందంగా ఉండ‌టానికి ఏం తింటారు? ఏం చేస్తారంటూ నెట్లో సెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టేశారు జ‌నాలు. అలాంటి వారి కోస‌మే త‌న బ్యూటీ సీక్రెట్స్ ని రివీల్ చేశారు సోయ‌గాల సుంద‌రి శ్రియ‌.

నేను ఇప్ప‌టికీ చ‌ర్మానికి రోజ్ వాట‌ర్ మాత్ర‌మే వాడుతాను. చ‌ర్మాన్ని తాజాగా ఉంచ‌డంలో గులాబీజ‌ల్‌ని మించింది మ‌రొక‌టి నాకెప్పుడూ క‌నిపించ‌దు. అలాగే డ్యాన్స్ చేస్తాను. ఇష్టంగా డ్యాన్స్ చేస్తే క్యాల‌రీలు ఇలా ఖ‌ర్చ‌యిపోతాయి. స్విమ్మింగ్ చేయ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌తాను. నీళ్ల‌ల్లో ఉంటే అస‌లు టైమ్ గ‌డ‌వ‌డ‌మే తెలియ‌దు.

ఫాస్ట్ ఫుడ్ రుచిని నేనెప్పుడో మ‌ర్చిపోయా. ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు. ఏదైనా ప‌చ్చిగా తిన‌డానికే ఇష్ట‌ప‌డ‌తాను. ఉద‌యాన్నే ఆరంజ్ జ్యూస్‌తో నా దిన‌చ‌ర్య‌ను ప్రారంభిస్తాం. ఆమ్లెట్ ప్ర‌తిరోజూ త‌ప్ప‌క తింటాను. నా తిండిని పొర‌పాటున ఎవ‌రైనా తింటే, ఉప్పు వేసుకోవ‌డం మ‌ర్చిపోయానేమోన‌ని అనుకుంటారు. అంత త‌క్కువ ఉప్పు తింటాను. ప్ర‌తిరోజూ ప‌డుకునేముందు పాలు త‌ప్ప‌కుండా తాగుతాను అని సీక్రెట్స్ రివీల్ చేసేశారు నార్త్ బ్యూటీ.

లాస్ట్ ఇయ‌ర్ ట్రిపుల్ ఆర్ సినిమాతోనూ, హిందీ దృశ్యంతోనూ జ‌బ‌ర్ద‌స్త్ హిట్స్ అందుకున్నారు శ్రియ. ఈ ఏడాది ఉపేంద్ర న‌టిస్తున్న క‌బ్జా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.