English | Telugu

బాపు అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు అంత్యక్రియలు పూర్తయ్యాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం బీసెంట్ నగర్ శ్మశానవాటికలో బాపుకు అంత్యక్రియలు నిర్వహించారు.ఈ అంతిమయాత్రలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రావికొండలరావు, బోనీ కపూర్, అనిల్ కపూర్ తదితర సినీ ప్రముఖులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. బాపును చివరి చూపు చూసుకోవడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.