English | Telugu

‘అఖండ2’ బాలయ్య విశ్వరూపం.. పండగ చేసుకుంటున్న అభిమానులు!

నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ‘అఖండ2 తాండవం’ రిలీజ్‌ దగ్గరికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని కూడా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న అఖండ2 చిత్రం దాన్ని మించే స్థాయిలో ఉందని ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌ వంటి వాటి ద్వారా తెలుస్తోంది. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా ‘అఖండ2’ రిలీజ్‌ కాబోతోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేశారు. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపం ఈ టీజర్‌లో మరింత విస్తృతంగా కనిపించింది. బోయపాటి టేకింగ్‌, దానికి తగినట్టుగానే థమన్‌ అదిరిపోయే మ్యూజిక్‌తో టీజర్‌ దద్దరిల్లిపోయింది. బాలయ్య పవర్‌ ఫుల్‌ డైలాగులు, కొత్తగా అనిపించే ఫైట్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.
తాజాగా రిలీజ్‌ అయిన టీజర్‌లో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అతను చెడుతో పోరాడడు, దానిని నాశనం చేస్తాడు అంటూ బాలయ్య క్యారెక్టర్‌ ఎలివేట్‌ చేసే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నట్టుగా ఈ టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

‘భారత్‌ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డంపెట్టుకునే కొట్టాలి’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ‘అఖండ 2’ టీజర్‌ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. ‘కొండల్లో తొండలు తిని బ్రతికే మీరెక్కడ.. ప్రతీ కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ’ అనే డైలాగ్‌ డెఫినెట్‌గా థియేటర్‌లో చప్పట్లు కొట్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్‌లక్షణ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. తన విన్యాసాలు చూపిస్తున్న సమయంలో ఆంజనేయుడ్ని కూడా చూపించడం ఆ యాక్షన్‌సీన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డెఫినెట్‌గా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందని టీజర్‌ ప్రూవ్‌ చేసింది.