English | Telugu

నవ తెలంగాణలో మొదలైన బాలకృష్ణ సినిమా

నవ తెలంగాణలో మొదలైన బాలకృష్ణ సినిమా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్న, ఈ రోజునేబాలకృష్ణ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. కొత్త దర్శకుడు సత్యదేవా దర్సకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ వ్యాపార వేత్త రుద్రపాటి రమణా రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది.ఈ చిత్ర ఓపెనింగ్ కి చిత్రపరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారయణరావు క్లాప్ కొట్టగా, దర్శకులు రాఘవేంద్రరావు స్విచ్ ఆన్ చేశారు.
ఇక తొలి షాట్‌ బాలకృష్ణ పంచ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ‘కొందరు కొడితే ఎక్స్-రే లో కనిపిస్తుంది. కొందరు కొడితే స్కానింగ్‌లో కనిపిస్తుంది. నేను కొడితే హిస్టరీలో కనిపిస్తుంది’ అని బాలకృష్ణ తరహా పంచ్ డైలాగ్‌ ప్రారంభపు షాట్ గా చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్సే’ అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ ఆవిర్భావ సంబరాలతో హైదరబాదు సహా తెలంగాణ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటు ఉంటే బాలయ్య అభిమానులు తమ హీరో కొత్త సినిమా ప్రారంభోత్సవమైనందుకు హుషారుగా ఉన్నారు. ఏమైనా తెలుగు ప్రజలిరివురికి సంతోష వాతవరణం ఇలా మొదలైంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.