English | Telugu
బాలయ్య లెజెండ్ పాటల విశేషాలు
Updated : Feb 12, 2014
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "లెజెండ్". బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను మార్చి 7న శిల్పకళా వేదికలో విడుదల చేయనున్నారు. "సింహ" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత బాలయ్య, బోయపాటిల కాంబినేషన్ లో వస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతే కాకుండా తొలిసారి బాలకృష్ణ సినిమాకు యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. "భద్ర", "తులసి" వంటి మ్యూజికల్ హిట్ చిత్రాల తర్వాత దేవి, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న ఈ ఆడియోపై అభిమానుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. దేవి కూడా అదరగొడుతున్నాడని తెలిసింది. ఈ సినిమా కోసం దర్శకుడు మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలయ్య వాడే వాహనాలు, ఆయుధాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. అంతే కాకుండా ఇందులో విలన్ గా ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తుంది. మరి ఈ సినిమా విడుదలై ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది.