English | Telugu

‘బాహుబలి’ షూటింగ్‌లో ప్రమాదం..!

ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్రం షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫైట్ సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా తెరకేకిస్తున్నారు రాజమౌళి. అయితే శనివారం ఈ ఫైట్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ స్థాయిలో కుంకుమను వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కనే వున్న ఫైటర్లలలో కొంతమందికి ఈ మంటల వల్ల స్వల్పగాయాలయ్యాయి. వెంటనే వారిని హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో యూనిట్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.