English | Telugu
"ఒక్క అడుగు"కు జక్కన్న గ్రీన్ సిగ్నల్...!
Updated : Jul 30, 2013
"బాహుబలి" చిత్రం విడుదల అవ్వాలంటే దాదాపు రెండు సంవత్సరాలు పట్టేట్లుగా ఉందని రాజమౌళిని ఒప్పించి "మిర్చి" సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది. అయితే ఇటీవలే మళ్ళీ "బాహుబలి" షూటింగ్ ప్రారంభమయినప్పటికి, ఎందుకో కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తుంది.
ఇదిలా ఉంటే కృష్ణంరాజు తన సొంత బ్యానర్లో ప్రభాస్ తో "ఒక్క అడుగు" చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఎందుకంటే "బాహుబలి" చిత్ర షూటింగ్ వాయిదా పడుతుండటంతో... ఈ గ్యాప్ లో ఎలాగైనా "ఒక్క అడుగు" చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. దీనికి "బాహుబలి" చిత్ర దర్శకుడు రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడంట. ప్రస్తుతం "ఒక్క అడుగు" చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయ్యిందని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే ఇంకో విషయమేమిటంటే.... "బాహుబలి" కోసం తన గెటప్ ను పూర్తిగా కండల వీరుడిగా మార్చేసిన ప్రభాస్.. "ఒక్క అడుగు" చిత్రం షూటింగ్ లో పాల్గొంటే "బాహుబలి" గెటప్ లోనే కనపడే అవకాశాలున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.