English | Telugu

తిరుపతిలో 'బాహుబలి' ఆడియో

టాలీవుడ్ దర్శకసంచలనం యస్‌.యస్‌.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి`ది బిగినింగ్‌’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణోత్సవం ఈ నెల 13న తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని ‘యువ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.’ సొంతం చేసుకొంది.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో శోభు యార్లగడ్డ..ప్రసాద్‌ దేవినేని ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.