Read more!

English | Telugu

అల్లు అర్జున్ బద్రీనాథ్ విశేషాలు

అల్లు అర్జున్ "బద్రీనాథ్" విశేషాలు అంటే షూటింగ్ ఎక్కడ జరుగుతోంది...షూటింగ్ అసలు ఎంతవరకూ జరిగింది ఇత్యాదులన్నీ మీ కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాం. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బద్రినాథ్". ప్రస్తుతం అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అక్కడ అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాలోని "చిరంజీవ చిరంజీవ" అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ "బద్రీనాథ్" మూవీ ఆడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాకి కీరవాణి సంగీతాన్నందించారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా ట్రైలర్స్ లో అల్లు అర్జున్ డ్యాన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, గౌతం రాజు ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ "బద్రీనాథ్" మూవీ జూన్ 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని వినపడుతోంది.