English | Telugu

బాహుబలి ప్రభాస్ భుజానికి సర్జరీ

ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ప్రభాస్‌కు శస్త్ర చికిత్స జరిగింది. దీని గురించి ఆయన ఫేస్ బుక్ లో వివరిస్తూ - ‘‘ ఎప్పుడో చేయించుకోవాలసిన చిన్నపాటి ఆపరేషన్ నెలరోజుల క్రితం చేయించుకున్నాను. భుజానికి సంబంధించిన ఈ ఆపరేషన్ ఎప్పటి నుంచో వాయిదా వేస్తు వచ్చాను. ఇంకా వాయిదా వేస్తే మంచిది కాదనిపించి, చేయించుకున్నాను. ఆపరేషన్ జరిగి నెలరోజులైంది. కాబట్టి, తేరుకున్నాను. మరో నెలలోపు షూటింగ్‌లో కూడా పాల్గొంటాను’’ అని తెలిపారు ప్రభాస్.


ప్రభాస్ బాహుబలి షూటింగ్ లోకేషన్లో అనారోగ్యానికి లోనయ్యాడని, కోమాలోకి వెళ్లిపోయాడనీ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. అప్పుడు అభిమానులు ఆందోళన చెందకూడదని తాను బాగానే ఉన్నాడంటూ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు ప్రభాస్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.