English | Telugu

బి.ఎ.రాజుకి జన్మదిన శుభాకాంక్షలు

బి.ఎ.రాజుకి జన్మదిన శుభాకాంక్షలు. సినీ పరిశ్రమలో ఒక సామాన్య విలేఖరిగా తన జీవితాన్ని ప్రారంభించిన బి.ఎ.రాజు అంచలంచెలుగా ఎదిగి "సూపర్ హిట్" పత్రిక అధిపతిగా, నిర్మాతగా మారారు. అందరికీ తలలో నాలుకగా ఉంటూ, తాను పి.ఆర్.ఒ.గా పనిచేసే సినిమాని ప్రమోట్ చేయటంలో బి.ఎ.రాజుని మించిన వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ రోజున చిన్న, పెద్ద నిర్మాతలందరికీ అవసరమైన పేరు బి.ఎ.రాజు. మనసున్న మంచి మనిషిగా, స్నేహశీలిగా బి.ఎ.రాజుకి తెలుగు సినీ పరిశ్రమలో పేరుంది.

అందుకనే యువరత్న నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ యన్.టి.ఆర్., ప్రిన్స్ మహేష్ బాబు వంటి అనేకమంది హీరోలకూ, అన్నపూర్ణ స్టుడియోస్, ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వంటి అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలకీ బి.ఎ.రాజు పి.ఆర్.ఒ. అంతే కాది ఆయన నిర్మాతగా "చంటిగాడు, ప్రేమలో పావనీ కళ్యాణ్, గుండమ్మగారి మనవడు" వంటి చిత్రాలను నిర్మించారు.

ఆయన ప్రస్తుతం రాకింగ్ స్టార్ ఆది హీరోగా, శాన్విని హీరోయిన్ గా పరిచయం చేస్తూ,లేడీ డైనమిక్ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో "లవ్ లీ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం కేరళ వెళ్ళిన బి.ఎ.రాజు గారికి తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.