English | Telugu

సుడిగాలి సుధీర్ మిస్సింగ్.. రాంప్రసాద్ ఇన్స్టాగ్రామ్‌ పోస్ట్ వైరల్!

బుల్లితెర మీద జబర్దస్త్ ఎంత పాపులర్ షోనో అందరికీ తెలుసు. అలాంటి షో ద్వారా గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యారు. వీళ్ళు లేకుండా జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ లేదు అన్నట్టుగా ఉంది. ఐతే వీళ్ళు రీసెంట్ గా స్విజ్జర్లాండ్ వెళ్లారు. ఆటో రాంప్రసాద్, హెపర్ ఆది ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. డాడీ మూవీ నుంచి "మందారం బుగ్గల్లోకి" అనే సాంగ్ పాడుతూ వీడియో చేసారు. ఆ వీడియోని రాంప్రసాద్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు. ఇక వీళ్ళను చూసిన నెటిజన్స్ కామెంట్స్ వరద కురిపించారు. అందులోనూ సుడిగాలి సుధీర్ గురించి కూడా అడుగుతున్నారు.

"అన్నా మీరిద్దరే ఉన్నారు సుధీర్ అన్న ఎక్కడ...జబర్దస్త్ మీకు ఎంత మేలు చేసింది బ్రదర్, అన్నా ఎటు చూసినా సాల్ట్ ఏ ఉంది ఏంటన్నా ? సన్నీని తీసుకువెళ్లలేదా ? నాకేంటి సొంతం మూవీ సీన్స్ గుర్తొస్తున్నాయి ? ఛిల్ల్ అవ్వండి జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్, హాయ్ రాంప్రసాద్ గారు మీ వీడియో చాలా బాగుంది జబర్దస్త్ టీమ్ అందరికి హ్యాపీ డేస్ ...మీ పని బాగుంది అన్న, అన్న ఈడ సలి సరిపోలేదని ఆడికి పోయారా, సూపర్ ప్లేస్ అన్నయ్య, ఆది గారు మంచు బాగా గట్టిగా ఉంటదండి జాగ్రత్తండీ.." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.