English | Telugu

డిసెంబర్ లో ఆడియో ఫంక్షన్ లు

తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండగ. అలాగే తెలుగు సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి పెద్ద పండగే. బాలయ్య వంటి హీరోలకు కొంతమందికి సంక్రాంతి హీరోలని పేరు. ప్రముఖ నిర్మాత యమ్.యస్.రాజుని సంక్రాంతి రాజనేవారు. మరి అలా సంక్రాంతికి సినిమా విడుదల అవ్వాలంటే ఆ చిత్రం ఆడియో డిసెంబర్ లోనే విడుదల అవ్వాలి. 2012 జనవరిలో రానున్న సంక్రాంతి పండుగకు ఈ సారి చాలా సినిమాలే విడుదల కానున్నాయి.

యువరత్న నందమూరి బాలకృష్ణ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న "అధినాయకుడు", మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "బిజినెస్ మ్యాన్", విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న "బాడీ గార్డ్", రవితేజ హీరోగా నటిస్తున్న "నిప్పు", సునీల్ హీరోగా నటిస్తున్న "పూలరంగడు", ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రెబెల్", ఆది హీరోగా నటిస్తున్న "లవ్లీ" చిత్రాలు ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఇవిగాక చిన్న చితక సినిమాలు మూడు నాలుగు ఉండే అవకాశాలున్నాయి. మరి ఇన్ని సినిమాల తాలూకు ఆడియో ఫంక్షన్లు డిసెంబర్ నెలలోనే ఉంటాయి...! అదీ సంగతి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.