English | Telugu
పవర్ బుల్లెట్టు వచ్చేస్తుందోచ్......!
Updated : Sep 19, 2013
సీమంద్ర ఉద్యమం కారణంగా వెనక్కి తగ్గిన పెద్ద హీరోల చిత్రాలు ఒకేసారి సందడి చేయడానికి సిద్దమయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు "అత్తారింటికి దారేది" చిత్రం ఓ పండగలా మారింది. ఈ చిత్ర ఆడియో, టీజర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అదే విధంగా పవన్ పాడిన "కాటమ రాయుడా" సాంగ్ యూట్యుబ్ లో ట్రెండ్ సెట్ చేసింది.
అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిన్న టీజర్ కె రికార్డుల మోత మోగించిన ఈ చిత్రం... విడుదలయ్యాక ఎలా ఉండబోతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలియనుంది.
బి.వి.ఎస్.ఎన్. నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.