English | Telugu

వరుణ్ తో ఎఫైర్ అబద్ధం- అస్మిత సూద్

"వరుణ్ తో ఎఫైర్ అబద్ధం" అని అస్మిత సూద్ అంటూంది. వివరాల్లోకి వెళితే "బ్రహ్మిగాడి కథ" సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించింది అస్మిత సూద్. ఈ అస్మిత సూద్ నిజానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, విలన్ అయిన సోనూ సూద్ కి చెల్లెలు కావటం విశేషం. అయితే తెలుగులో తన తొలి చిత్రం హిట్టయినా, నిర్మాతల దృష్టి, దర్శకుల దృష్టి ఆకర్షించటానికో ఏమో ఆమె ఈ మధ్య ఒక స్టేట్ మెంటిచ్చింది. అదే "వరుణ్ తో ఎఫైర్ అబద్ధం" అని.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఆమెకు అతనితో ఎఫైర్ ఉందట...అతను ఆమెతో తిగుతున్నాడట...వంటి గాసిప్స్ విపరీతంగా ఉంటాయి. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఆ రేంజ్ లో ఎల్లో జర్నలిజం లేకపోవటంతో పాపం అస్మితే "వరుణ్ తో ఎఫైర్ అబద్ధం" అని స్టేట్ మెంటిచ్చి నాపై గాసిప్పులు రాయండహో అని విలేఖరులకు హింటిస్తున్నట్లుంది. లేకపోతే వాళ్ళిద్దరికీ మధ్య ఎఫైర్ ఉందని ఎవరన్నారండీ.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.