English | Telugu

సునీల్ అల్లుడిగా కలెక్షన్ కింగ్

సునీల్ అల్లుడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారట. వివరాల్లోకి వెళితే డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా, పేరుగడించిన పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు మళ్ళీ తన లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ పతాకంపై, చాలా రోజుల తర్వాత తాను ప్రథాన పాత్రలో నటిస్తూ ఒక సినిమాని నిర్మించబోతున్నారు. ఆ సినిమాలో మోహన్ బాబు అల్లుడిగా నటిస్తూండగా, ప్రముఖ హాస్యనటుడు, హీరో అయిన సునీల్ ఈ చిత్రంలో మోహన్ బాబుకి మామగా నటిస్తున్నాడు. మీరు చదివింది కరెక్టే...సునీలే మామగా, మోహన్ బాబు అల్లుడుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో.

ఈ సినిమాకి కథ, మాటలు వ్రాయటానికి అరకు లోయకి వెళ్ళారట రచయితలు. కోన వెంకట్, గోపీ-మోహన్, బి.వి.యస్.రవి ఈ ముగ్గురూ ఈ సినిమాకి కథ, మాటలనందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇ.నివాస్ దర్శకత్వం వహించనున్నారట. తండ్రి లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ పతాకంపై, విష్ణువర్థన్ 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న, మనోజ్ కలసి మంచు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సినిమాలు తీస్తున్నారు. ఒకే కుటుంబం నుండి మూడు బ్యానర్లలో సినిమాలు తయారవటం విశేషం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.