Read more!

English | Telugu

ప్రముఖ హీరోయిన్ ప్రేమ పెళ్లి.. వరుడు మంజుమ్మేల్ బాయ్స్ నటుడు 

సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్, హీరోని ఇష్టపడిందంటే ఇక అంతే ఫిక్స్. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన ప్రేమని గెలిపించుకుంటుంది. అఫ్ కోర్స్  హీరో కూడా అదే చేస్తాడనుకోండి. కానీ ఒక హీరో, హీరోయిన్ మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు సినిమా ఎలా ఇంట్రెస్ట్ గా ఉంటుందని అనుకుంటున్నారా! వాళ్లిద్దరు నిజ జీవితంలో తమ ప్రేమని గెలిపించుకొని  పెళ్లి చేసుకున్నారు.   

అపర్ణ దాస్(aparna das)కేరళకి చెందిన ప్రముఖ హీరోయిన్.. గత ఏడాది మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఆదికేశవ్ లో నటించింది. తేజ్ సిస్టర్ క్యారక్టర్ లో మంచి పెర్ఫార్మెన్స్ నే ఇచ్చింది. తాజాగా ఆమె వివాహం ప్రముఖ  హీరో, నటుడు అయినటువంటి దీపక్ పరంబోల్‌ (deepak parambol)తో జరిగింది. కేరళలోని ప్రసిద్ధ దేవాలయంగా పేరు గాంచిన గురువాయూర్ లో ఈ బుధవారం  జరిగింది. ఇరు వైపు కుటుంబ సభ్యులు హాజరయ్యి వధూవరులని ఆశీర్వదించారు.  వీరిద్దరిది ప్రేమ వివాహం. 2019 లో మనోహరం అనే మూవీలో హీరో హీరోయిన్ లుగా చేసారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇరు వైపు  పెద్దలని ఒప్పించి ఒక్కటయ్యారు. ఇప్పుడు ఆ పెళ్లి ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.   

2018 లో  విడుదలైన నిజన్ ప్రకాశన్ అనే మూవీతో  అపర్ణ సినీ రంగ ప్రవేశం చేసింది. హీరోయిన్ గా పలు చిత్రాలు చేసింది. గత సంవత్సరం విడుదలైన డాడా తో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఆనంద్ శ్రీ బాల అనే  మూవీలో చేస్తుంది.  విజయ్ బీస్ట్ లోను తళుక్కుమంది. ఇక  దీపక్ విషయానికి  వస్తే ఇటీవల విడుదలైన మంజుమ్మేల్ బాయ్స్ లో సుది అనే  క్యారక్టర్ లో మెరిశాడు. 2010 లో సినీ రంగ ప్రవేశం చేసి 35 కి పైగా చిత్రాల్లో నటించాడు.