Read more!

English | Telugu

నేను ప్రతి సంవత్సరం పెళ్ళి చేసుకుంటున్నాను.. అంజలి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

కోనసీమలో పుట్టి తమిళనాట హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. 2006లో తెరంగేట్రం చేసిన అంజలి 18 ఏళ్ళుగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కెరీర్‌ ప్రారంభంలో తెలుగులో సినిమాలు చేసినప్పటికీ తమిళ్‌లోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల విడుదలైన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఆమె నటించిన 50వ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలియజేసింది. అంతేకాదు, తన పెళ్లి గురించి కూడా తమాషా వ్యాఖ్యలు చేసింది. 

‘సరిగ్గా పదేళ్ళ క్రితం వచ్చింది ‘గీతాంజలి’. ఆ సినిమా నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్‌ పార్ట్‌ని ఎంత ఎంజాయ్‌ చేస్తూ నటించానో, సీక్వెల్‌ని కూడా అంతే ఎంజాయ్‌ చేశాను. నాకు ఎంతో బాగా నచ్చిన కథ ఇది. ఈ సీక్వెల్‌ కథను నేను ‘నిశ్శబ్దం’ సినిమా చేస్తున్న సమయంలోనే కోన వెంకట్‌ చెప్పారు. అది సెట్స్‌ పైకి వెళ్లడానికి, రిలీజ్‌ అవ్వడానికి ఇంత టైమ్‌ పట్టింది. ఫస్ట్‌ పార్ట్‌ని ఆడియన్స్‌ ఎంత బాగా ఎంజాయ్‌ చేశారో.. సెకండ్‌ పార్ట్‌ని కూడా ఆడియన్స్‌ అంత బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇకపోతే నా పెళ్లికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూమర్స్‌ పుట్టుకొస్తూనే ఉంటాయి. వాటన్నింటినీ నేను చాలా ఎంజాయ్‌ చేస్తాను. ఇప్పటికే నాకు ఐదారు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆడియన్స్‌ కానివ్వండి, నెటిజన్లు కానివ్వండి నాకు సంవత్సరానికి ఒక పెళ్లి చేస్తున్నారు. నా పెళ్ళి గురించి వాళ్ల ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు. ఒక ఏడాది నా పెళ్ళి ఒక బిజినెస్‌మెన్‌తో అన్నారు, మరో ఏడాది నేను ఓ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పుకున్నారు. విచిత్రం ఏమిటంటే నాకు సంవత్సరానికి ఒక పెళ్ళి చేసినా వాళ్ళకి మాత్రం బోర్‌ కొట్టడం లేదు. నేను ఏ సినిమాలో నటించినా అది విడుదలయ్యే సమయంలోనే ఇలాంటి వార్తలు ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. నా మీద అభిమానంతో నేను పెళ్లి చేసుకోవాలని వారు కోరుకుంటున్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది’ అన్నారు అంజలి.