English | Telugu
నితిన్ రాబిన్ హుడ్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
Updated : Mar 25, 2025
నితిన్(Nithiin)అప్ కమింగ్ మూవీ 'రాబిన్ హుడ్'.(Robinhood)యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండగా ఈ నెల 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.'భీష్మ' తర్వాత సరైన హిట్ లేకపోవడంతో రాబిన్ హుడ్ పై నితిన్ తో పాటు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.పుష్ప 2(Pushpa 2)తో పాన్ ఇండియా హిట్ ని అందుకున్న మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కిస్సిక్ సాంగ్ తో నేషనల్ వైడ్ గా పేరు పొందిన శ్రీలీల(sreeleela)భీష్మ దర్శకుడు వెంకీ కుడుమల(venki Kudumula)రాబిన్ హుడ్ కి పని చేస్తుండటంతో,ఈ సారి నితిన్ ఖాతాలో హిట్ పడటం ఖాయమనే మాటలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP government)టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇస్తు అధికారంగా ఒక జీవో జారీ చేసింది.దీంతో రాబిన్ హుడ్ టికెట్ రేట్స్ సింగల్ స్క్రీన్ లో 50 రూపాయిలు,మల్టిప్లెక్స్ 75 రూపాయిల దాకా పెరగనున్నాయి.పెరిగిన ధరలు మూవీ రిలీజైన డేట్ దగ్గరుంచి మొదటి వారం రోజులు పాటు మాత్రమే వర్తిస్తాయని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది.
నితిన్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ లో ప్రముఖ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)రాజేంద్ర ప్రసాద్,షైన్ టామ్ చాకో,వెన్నెల కిషోర్,బ్రహ్మాజీ,ఆడు కాలం నరేష్,మైమ్ గోపి కీలక పాత్రలు పోషిస్తున్నారు.జీవి ప్రకాష్ (Gv Prakash Kumar)సంగీతాన్ని వహించగా సాయి శ్రీరామ్(sai Sriram)ఫోటోగ్రఫీ ని అందించాడు.ప్రముఖ హీరోయిన్ కేతిక శర్మ(Ketika Sharma)ఒక ప్రత్యేక గీతంలో చేసింది.