English | Telugu

ముచ్చటగా మూడు.. షాకిస్తున్న అక్కినేని అఖిల్! 

అక్కినేని అఖిల్ ఒక భారీ విజయాన్ని అందుకుంటే చూడాలని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' మాత్రమే కమర్షియల్ సక్సెస్ సాధించింది. మిగతా నాలుగు సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలాయి. ముఖ్యంగా గత చిత్రం 'ఏజెంట్' డిజాస్టర్ గా నిలిచింది. ఏజెంట్ వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇంతవరకు అఖిల్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వారి నిరాశకు త్వరలోనే శుభం కార్డు పడబోతోంది. అఖిల్ ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లతో సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. (Akhil Akkineni)

ఏజెంట్ తర్వాత యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. అనిల్ అనే నూతన దర్శకుడితో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేశారు. కానీ, ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వినికిడి.

అలాగే 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో కూడా అఖిల్ ఒక సినిమా కమిట్ అయ్యాడు. నాగార్జున నిర్మిస్తున్న ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీకి 'లెనిన్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అంతేకాదు, అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా ఈ మూవీ షూట్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఏడాదిలోనే లెనిన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక తాజాగా అఖిల్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'సామజవరగమన' మాటల రచయిత నందు సవిరిగాన ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్న ఈ మూవీ.. 'సామజవరగమన' తరహాలోనే ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని టాక్.

ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు ఉంది. ఆ రోజున ఈ మూడు ప్రాజెక్ట్ లకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశముంది.

సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.