English | Telugu
కన్నడ నుంచి మరో 'కాంతార'!
Updated : Jun 13, 2023
'కేజీఎఫ్'తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రసీమ 'కాంతార'తో తన ప్రతిష్టను మరింత పెంచుకుంది. కన్నడనాట తాజాగా ఈ కోవలో మరో చిత్రం చేరింది. 'కలివీర' పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా 'కలివీరుడు' పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని.. మినిమం గ్యారంటీ మూవీస్ పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. అవి దర్శకత్వంలో రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జులై ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. 'కాంతార' కోవలో 'కలివీరుడు' తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అచ్చిబాబు నమ్మకం వ్యక్తం చేశారు. రాఘవేంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా హలేష్ ఎస్, ఎడిటర్ గా ఎ.ఆర్.కృష్ణ వ్యవహరించారు.
కన్నడ సినిమాలు 'కేజీఎఫ్', 'కాంతార' తెలుగునాట ఎంతటి విజయాలు సాధించాయో తెలిసిందే. వాటి బాటలోనే 'కలివీరుడు' పయనిస్తుందేమో చూడాలి.