English | Telugu
సుమకు వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్
Updated : Feb 24, 2014
టాలీవుడ్ లేడీ యాంకర్ లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, టాప్ 5 లో ఒకరిగా కొనసాగుతున్న సుమ అప్పుడప్పుడు తన నోటి దురుసు చూపిస్తూంటుందని అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఓ ఆడియో ఫంక్షన్ కు యాంకర్ గా వ్యవహరించిన ఈ అమ్మడు తన నోటి దురుసును ప్రదర్శించింది. ఆ సినిమా హీరోయిన్ కొత్తమే. హీరోయిన్ ను స్టేజ్ మీదకు పిలుస్తున్న సమయంలో హీరోయిన్ ను చూసి... "సిగ్గుపడకమ్మా.., అయినా మీ హిందీ హీరోయిన్స్ కు సిగ్గు ఎక్కడ ఉందిలే" అంటూ సుమ కాస్త నోరు జారింది. అయితే ఆ సమయంలో హీరోయిన్ కూడా నవ్వుతూ కనిపించేసింది.
కానీ ఫంక్షన్ అయిపోయాక ఆ హీరోయిన్ సుమ దగ్గరకు వెళ్లి "మైండ్ యువర్ టంగ్" అంటూ వార్నింగ్ ఇచ్చిందట. దాంతో ఖంగు తిన్న సుమకు ఏం చెయ్యాలో తెలియక.." నీలాంటి వాళ్ళని వారానికి ఇద్దర్ని చూస్తాను. నువ్వు నాకు చెప్పడమేంటి" అంటూ హీరోయిన్ పై ఫైర్ అయ్యిందట. దాంతో వారిద్దరి మధ్య మాట మాట పెరగడంతో అక్కడ ఉన్నవాళ్లు వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి పంపించేసారట. అంతేలే తప్పులేకుండా నోరు జారితే ఈ మధ్య ఎవరూ ఉరుకోవట్లేదు మరి.